పొగాకు కొనుగోళ్లు, ఎగుమతులపై కేంద్రం సమీక్ష
ABN , Publish Date - Jul 10 , 2026 | 04:42 AM
ఏపీలో ఎఫ్‌సీవీ పొగాకు కొనుగోళ్లపై కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ సమీక్షించింది. భారత వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి నితిన్‌కుమార్ యాదవ్ నేతృత్వంలో..
మార్కెట్ అవకాశాలు విస్తరించడంపై చర్చ
అమరావతి, జూలై 9(ఆంధ్రజ్యోతి): ఏపీలో ఎఫ్‌సీవీ పొగాకు కొనుగోళ్లపై కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ సమీక్షించింది. భారత వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి నితిన్‌కుమార్ యాదవ్ నేతృత్వంలో వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులు బృందం గురువారం హైదరాబాద్‌లో భేటీ అయ్యింది. ఏపీలో ఎఫ్‌సీవీ పొగాకు మార్కెటింగ్ సీజన్ 2025-26ను సమీక్షించింది. ఈ బృందం పొగాకు రైతులు, తయారీదారులు, ఎగుమతిదారులు, డీలర్లు, వ్యాపార సంఘాల ప్రతినిధులు, పొగాకు బోర్డు అధికారులతో చర్చలు జరిపింది. ఏపీలో పొగాకు కొనుగోళ్లను వేగవంతం చేయడానికి, ఎగుమతులను సులభతరం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించింది.