గ్రామాల అభివృద్ధికి కేంద్రం కృషి
ABN , Publish Date - Jun 30 , 2026 | 06:23 AM
ప్రభుత్వ పథకాల ద్వారా దేశవ్యాప్తంగా గ్రామాలు ప్రగతిపథంలో ముందుకు సాగేందుకు కేంద్రం కృషి చేస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్లశాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు.
కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడి
న్యూఢిల్లీ, జూన్ 29(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పథకాల ద్వారా దేశవ్యాప్తంగా గ్రామాలు ప్రగతిపథంలో ముందుకు సాగేందుకు కేంద్రం కృషి చేస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్లశాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. సోమవారం ఇక్కడ రాష్ట్రీయ గ్రామీణ్ వికాస్ సమ్మేళన్‌లో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో వీబీజీ రామ్‌జీ పథకాన్ని జూలై 2న తిరుపతిలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ పథకాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందన్నారు. గత రెండేళ్లలో తన శాఖ పరిధిలోని ప్రతి పథకంలో పారదర్శకత తీసుకొచ్చానని, దేశంలో పేదలకు అదనంగా 2 కోట్ల ఇళ్లను నిర్మించామని, 2 కోట్ల మందిని లఖ్‌పతీ దీదీలుగా తీర్చిదిద్దామని చెప్పారు. డీడీయూజీకేవై ద్వారా యువతకు నైపుణ్య శిక్షణను అందిస్తున్నామన్నారు.