రాష్ట్రంలో సీ ప్లేన్ కార్యకలాపాల అభివృద్ధి: కేంద్ర సహాయ మంత్రి
ABN , Publish Date - Feb 03 , 2026 | 04:30 AM
ఉడాన్ 5.5 పథకం కింద ఆంధ్రప్రదేశ్ సీ ప్లేన్ కార్యకలాపాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు పౌరవిమానయాన సహాయ మంత్రి మురళీధర్...
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): ఉడాన్ 5.5 పథకం కింద ఆంధ్రప్రదేశ్ సీ ప్లేన్ కార్యకలాపాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు పౌరవిమానయాన సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ తెలిపారు. సోమవారం ఎంపీ బీద మస్తాన్ రావు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఇందుకోసం 10 జలాశయాలను గుర్తించినట్లు ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సీ ప్లేన్ లకోసం ఏరో డ్రోమ్‌లను అభివృద్ధి చేస్తుందని, విమానాశ్రయాలు, హెలీకాప్టర్లు, నీటి ఏరో డ్రోమ్‌ల అభివృద్ధి పథకం కింద ఇందుకు నిధులు కేటాయించడం జరుగుతుందని వెల్లడించారు.