26న పోలవరానికి కేంద్ర జలశక్తి కార్యదర్శి
ABN , Publish Date - Mar 03 , 2026 | 04:51 AM
పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని స్వయంగా పరిశీలించేందుకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావు ఈ నెల 26వ తేదీన రానున్నారు.
అమరావతి, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని స్వయంగా పరిశీలించేందుకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావు ఈ నెల 26వ తేదీన రానున్నారు. ఈ మేరకు రాష్ట్ర జల వనరుల శాఖకు మౌఖికంగా సమాచారం అందింది. త్వరలోనే పూర్తిసమాచారం అధికారికంగా రానుంది. కాగా.. కీలకమైన డయాఫ్రం వాల్ పనులు దాదాపు 90 శాతం దాకా పూర్తయ్యాయి. మిగిలిన పది శాతం కూడా ఈ నెలాఖరునాటికి పూర్తి చేస్తామని ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. ఈ వాల్ పూర్తయిన వెంటనే.. దానిపై ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ (ఈసీఆర్‌ఎఫ్) డ్యాం పనులు శరవేగంగా పూర్తి చేసేందుకు పక్కనే ఉన్న కొండల నుంచి భారీ సైజు బండరాళ్లను కాంట్రాక్టు సంస్థ సేకరిస్తోంది.