పోలవరం భూసేకరణపై కేంద్రం ప్రత్యేక దృష్టి
ABN , Publish Date - Apr 27 , 2026 | 04:50 AM
పోలవరం ప్రాజెక్టు భూసేకరణ, ఇతర సమస్యలపై జలశక్తి శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. 45.72మీటర్ల కాంటూరులో 194.6 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన భూసేకరణతో సహా..
అమరావతి, ఏప్రిల్ 26(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు భూసేకరణ, ఇతర సమస్యలపై జలశక్తి శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. 45.72మీటర్ల కాంటూరులో 194.6 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన భూసేకరణతో సహా.. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా ముంపు సమస్యలు, పర్యావరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఇందు కోసం కార్యాచరణ ప్రణాళికలు అమలు చేసేందుకు వచ్చేనెల 1న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌తో జలశక్తి శాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావు సమావేశం కానున్నారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు, కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వశాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఆ తర్వాత మే 5న ఉదయం 11గంటలకు వర్చువల్ విధానంలో సీఎస్‌తో కాంతారావు సమావేశం కాన్నారు. ఈ సమావేశంలో భూసేకరణపై కేంద్రం స్పష్టమైన నిర్ణయం తీసుకుంటుందని జల వనరుల శాఖ అధికారులు చెబుతున్నారు.