Share News

ఏపీ అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం

ABN , Publish Date - Jun 24 , 2026 | 04:22 AM

ఆంధ్ర ప్రదేశ్‌ అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి టోఖన్‌ సాహు చెప్పారు.

ఏపీ అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం

  • అమరావతి నిర్మాణంలో చంద్రబాబు విజన్‌ భేష్‌

  • కేంద్ర, రాష్ట్రాల సమన్వయంతో వేగంగా పనులు: కేంద్ర మంత్రి సాహు

తుళ్లూరు, జూన్‌ 23(ఆంధ్రజ్యోతి): ఆంధ్ర ప్రదేశ్‌ అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి టోఖన్‌ సాహు చెప్పారు. మంగళవారం అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. గ్రావిటీ కెనాల్‌, ఎన్‌-16 ట్రంక్‌ రోడ్డు, హెచ్‌వోడీ టవర్స్‌, రిటర్నబుల్‌ ప్లాట్లు ఉన్న ఎల్‌పీఎస్‌ జోన్‌ 7 ప్రాంతాల్లో పనులను పరిశీలించారు. వివిధ ప్రాజెక్టుల పురోగతిపై అధికారులు ఆయనకు సమగ్ర వివరాలు అందించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సాహు మాట్లాడుతూ అమరావతి అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేస్తున్న విజన్‌ను అభినందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అమరావతిలో కీలక ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగుతున్నాయని చెప్పారు. ఈ పర్యటనలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ, మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్‌, డైరెక్టర్‌ సంపత్‌ కుమార్‌, గృహ నిర్మాణ శాఖ ఎండీ అరుణ్‌కుమార్‌, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ పట్టాభిరామ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 24 , 2026 | 04:23 AM