Share News

రూ.1990 కోట్లతో విశాఖ, మంగళగిరి అభివృద్ధి

ABN , Publish Date - May 22 , 2026 | 05:04 AM

రాష్ట్రంలోని పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం సహకరించనుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నాలుగు ప్రధాన ప్రాజెక్టులకు కేంద్ర గృహ నిర్మాణ..

రూ.1990 కోట్లతో విశాఖ, మంగళగిరి అభివృద్ధి

  • పలు పనులకు కేంద్రం ఆమోదం

అమరావతి, మే 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం సహకరించనుం ది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నాలుగు ప్రధాన ప్రాజెక్టులకు కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని అర్బన్‌ చాలెంజ్‌ ఫండ్‌(యూసీఎఫ్‌) ఇచ్చేందుకు జాతీయ అపెక్స్‌ కమిటీ ఆమోదం తెలిపింది. మొత్తం ప్రాజె క్టు వ్యయం రూ.1990.83 కోట్లు కాగా, ఇందు లో కేంద్ర సహాయం రూ.497.71 కోట్లుగా ఖరారైంది. దీంతో నగరాభివృద్ధి కార్యక్రమా లు వేగం పుంజుకోనున్నాయి. ముఖ్యంగా విశాఖపట్నం, అమరావతి రాజధాని ప్రాం తంలోని మంగళగిరి-తాడేపల్లి నగరాల్లో నీటి సరఫరా, డ్రైనేజీ, జలశుద్ధి వ్యవస్థలు ఆధునిక రూపం సంతరించుకోనున్నాయి.

ప్యూచర్‌ సిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మోడల్‌గా మధురవాడ

కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన నాలుగు ప్రాజెక్టుల్లో మూడు ప్రాజెక్టులు విశాఖపట్నం నగర పాలక సంస్థ పరిధిలోని మధురవాడ జోన్‌ కేంద్రంగా ఉన్నాయి. ప్రభుత్వం దీనిని ప్యూచర్‌ సిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మోడల్‌గా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రూ.606.78 కోట్లతో మధురవాడలో 401 కిలోమీటర్ల మేర అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజ్‌ నెట్‌వర్క్‌ నిర్మించనున్నారు. నగరంలోని మురుగునీటి నిర్వహణ వ్యవస్థను పూర్తిగా ఆధునీకరించనున్నారు. నిరంతర నీటి సరఫరా చేపట్టనున్నారు. బల్క్‌ వాటర్‌ సిస్టమ్‌ ఆధునీకరణకు రూ.110.46 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టు ద్వారా నగర నీటి సరఫరా ఆదాయ వ్యవస్థను డిజిటలైజ్‌ చేయనున్నారు.

మంగళగిరి-తాడేపల్లి నగరానికి కొత్త డ్రైనేజీ వ్యవస్థ

మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్‌ పరిధిలో రూ.584.10 కోట్లతో 303.79 కిలోమీటర్ల డ్రైనేజీ నెట్‌వర్క్‌ పనులు చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టుతో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 15 వేల కోట్ల విలువైన అర్బన్‌ ప్రాజెక్టు షెల్ప్‌ను సిద్ధం చేసింది.

మున్సిపల్‌ బాండ్లతో కొత్త ఫైనాన్స్‌ మోడల్‌

రాష్ట్ర మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ 2026 ఆగస్టు 30 నాటికి రూ.1000 కోట్ల మున్సిపల్‌ బాండ్లు విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీటి ద్వారా నగర స్థానిక సంస్థలు దీర్ఘకాలిక మూలధనాన్ని సమీకరిస్తాయి.

Updated Date - May 22 , 2026 | 05:07 AM