5 రాష్ట్రాలు, జమ్మూకశ్మీర్‌కు అదనపు విపత్తు సాయం
ABN , Publish Date - Mar 14 , 2026 | 04:29 AM
గతేడాది మొంథా తుఫాన్, వరదలు, క్లౌడ్‌బర్‌స్టలు, కొండచరియలు విరిగిపడిన ఘటనలతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాలు, యూటీ జమ్మూకశ్మీర్‌కు కేంద్రం రూ.1,912.99 కోట్ల అదనపు ఆర్థిక సాయాన్ని ఆమోదించింది.
ఆంధ్రప్రదేశ్‌కు రూ.341.48 కోట్లు
న్యూఢిల్లీ, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): గతేడాది మొంథా తుఫాన్, వరదలు, క్లౌడ్‌బర్‌స్టలు, కొండచరియలు విరిగిపడిన ఘటనలతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాలు, యూటీ జమ్మూకశ్మీర్‌కు కేంద్రం రూ.1,912.99 కోట్ల అదనపు ఆర్థిక సాయాన్ని ఆమోదించింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నేతృత్వంలో జరిగి ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు శుక్రవారం ఓ అధికారిక ప్రకటన పేర్కొంది. మొత్తం అదనపు విపత్తు సాయంలో ఏపీకి రూ.341.48 కోట్లు కేటాయించారు. ఛత్తీస్‌గఢ్ కు రూ.15.70 కోట్లు, గుజరాత్‌కు రూ.778.67 కోట్లు, హిమాచల్‌ప్రదేశ్‌కు రూ.288.39 కోట్లు, నాగాలాండ్‌కు రూ.158.41 కోట్లు, జమ్మూకశ్మీర్‌కు రూ.330.34 కోట్ల అదనపు సాయాన్ని ఆమోదించారు. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎస్‌డీఆర్‌ఎఫ్) కింద రాష్ట్రాలకు ఇప్పటికే విడుదల చేసిన నిధులకు ఇది అదనపు సాయం.