రాష్ట్రానికి 6,372 కోట్ల సాస్కీ నిధులు
ABN , Publish Date - Feb 03 , 2026 | 04:07 AM
ఏపీకి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జనవరి 27 వరకు రూ.6,372.40 కోట్ల సాస్కీ(మూలధన పెట్టుబడి కోసం రాష్ట్రాలకు ప్రత్యేక...
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): ఏపీకి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జనవరి 27 వరకు రూ.6,372.40 కోట్ల సాస్కీ(మూలధన పెట్టుబడి కోసం రాష్ట్రాలకు ప్రత్యేక సాయం) నిధులను కేంద్రం విడుదల చేసింది. లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఈ మేరకు సోమవారం లిఖితపూర్వక సమాధానమిచ్చారు. తెలంగాణకు వరుసగా మూడేళ్లలో రూ.6,500 కోట్లు విడుదల చేశామన్నారు.