Share News

కేంద్రం నిర్ణయం.. డ్వాక్రా మహిళలకు వరం: మాధవ్‌

ABN , Publish Date - May 27 , 2026 | 06:06 AM

దీన్‌దయాళ్‌ అంత్యోదయ యోజన కింద కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ఏపీలోని లక్షలాది మంది డ్వాక్రా మహిళలకు వరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ అన్నారు.

కేంద్రం నిర్ణయం.. డ్వాక్రా మహిళలకు వరం: మాధవ్‌

అమరావతి, మే 26(ఆంధ్రజ్యోతి): దీన్‌దయాళ్‌ అంత్యోదయ యోజన కింద కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ఏపీలోని లక్షలాది మంది డ్వాక్రా మహిళలకు వరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ అన్నారు. మోదీ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు ఎలాంటి జామీను లేకుండా రూ.10 లక్షల వరకూ రుణం పొందే అవకాశం కల్పించి, మహిళా సాధికారతకు పెద్దపీట వేసిందన్నారు. గ్రామీణ, పట్టణ మహిళలకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ.. వారి ఆర్థిక స్థితిగతుల్ని మెరుగుపర్చడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని మాధవ్‌ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పేదరిక నిర్మూలనతో పాటు మహిళల్లో స్వావలంభన పెంపొందించే దిశగా కేంద్రం తీసుకున్న నిర్ణయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందన్నారు. చిన్న వ్యాపారాలు, పాడి పరిశ్రమలు, ఆహార ప్రాసెసింగ్‌ యూనిట్లలో మహిళలు ముందుకు వెళ్లేందుకు ఈ నిర్ణయాలు తోడ్పడతాయని మాధవ్‌ అన్నారు.

Updated Date - May 27 , 2026 | 06:07 AM