Share News

తూర్పు గోదావరిలో ఓఎన్‌జీసీ పైప్‌లైన్‌కు కేంద్రం ఓకే

ABN , Publish Date - May 20 , 2026 | 04:48 AM

తూర్పు గోదావరి జిల్లా పరిధిలో సహజ వాయువు రవాణాను మరింత బలోపేతం చేేసందుకు కేంద్రం చర్యలు తీసుకుంది.

తూర్పు గోదావరిలో ఓఎన్‌జీసీ పైప్‌లైన్‌కు కేంద్రం ఓకే

  • భూసేకరణకు నోటిఫికేషన్‌ జారీ

న్యూఢిల్లీ, మే 19(ఆంధ్రజ్యోతి): తూర్పు గోదావరి జిల్లా పరిధిలో సహజ వాయువు రవాణాను మరింత బలోపేతం చేేసందుకు కేంద్రం చర్యలు తీసుకుంది. ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ (ఓఎన్‌జీసీ) ఆధ్వర్యంలో ఆ జిల్లాలోని కపిలేశ్వరపురం మండలంలో కొత్తగా గ్యాస్‌ పైప్‌లైన్‌ వేసేందుకు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంగళవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ‘‘ఎమ్‌డీఏయూ నుంచి ఏమ్‌డీపీ 16’’ మార్గంలో ఈ పైప్‌లైన్‌ను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం కపిలేశ్వరపురం మండలంలోని నల్లూరు, పడమటి ఖండ్రిక, వెదురుమూడి గ్రామాల్లో మొత్తం 2.90 హెక్టార్ల భూమిని ేసకరించనున్నట్లు నోటిఫికేషన్‌లో కేంద్రం పేర్కొంది. ఈ పైప్‌లైన్‌ మార్గంలో భూములున్న రైతులు 21 రోజుల్లోగా తమ అభ్యంతరాలను రాజమండ్రిలోని ఓఎన్‌జీసీ కార్యాలయంలో రాతపూర్వకంగా అధికారులకు తెలియజేయాలని కేంద్ర పెట్రోలియం శాఖ అండర్‌ సెక్రటరీ రఘురామ్‌ కృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు.

Updated Date - May 20 , 2026 | 04:49 AM