Share News

కాగ్నిజెంట్‌ ఎస్‌ఈజెడ్‌కు కేంద్రం అనుమతి

ABN , Publish Date - Jul 04 , 2026 | 04:04 AM

విశాఖపట్నంలో కాగ్నిజెంట్‌ ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగంలో దిగ్గజ కంపెనీ కాగ్నిజెంట్‌కు రాష్ట్ర ప్రభుత్వం..

కాగ్నిజెంట్‌ ఎస్‌ఈజెడ్‌కు కేంద్రం అనుమతి

  • విశాఖలో 8.9 ఎకరాల్లో ఏర్పాటు.. ఇక విదేశాలకు ఐటీ సేవలు

విశాఖపట్నం, జూలై 3(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో కాగ్నిజెంట్‌ ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగంలో దిగ్గజ కంపెనీ కాగ్నిజెంట్‌కు రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నంలోని మధురవాడలో 22.19 ఎకరాలు కేటాయించిన విషయం తెలిసిందే. గత ఏడాది డిసెంబరు 12న సీఎం చంద్రబాబు సంస్థ నిర్మాణానికి భూమి పూజ చేశారు. మూడు దశల్లో నిర్మాణం పూర్తి చేసి 8 వేల మందికి ఉపాధి కల్పిస్తామని కాగ్నిజెంట్‌ ఒప్పందంలో హామీ ఇచ్చింది. నిర్మాణం పూర్తయ్యేంత వరకు తాత్కాలికంగా రుషికొండ ఐటీ పార్కులోని మహతి టెక్నాలజీ భవనంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. విశాఖ కేంద్రం నుంచి విదేశాలకు ఐటీ సేవలు అందించడానికి ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌) ఏర్పాటు చేస్తామని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖకు కాగ్నిజెంట్‌ ప్రతిపాదనలు పంపగా, దానికి ఆమోదం లభించింది. రాష్ట్రం కేటాయించిన 22.19ఎకరాల్లోని మధురవాడలో మొత్తం 8.9799 ఎకరాల్లో ఎస్‌ఈజెడ్‌ ఏర్పాటు చేస్తామని కాగ్నిజెంట్‌ పేర్కొంది. ఎస్‌ఈజెడ్‌ ఏర్పాటు వల్ల సంస్థకు కొన్నిప్రత్యేక రాయితీలు పన్ను మినహాయింపులు లభిస్తాయి. ఇందులో ఉత్పత్తులను విదేశాలకు మాత్రమే ఎగుమతి చేయాల్సి ఉంటుంది.

Updated Date - Jul 04 , 2026 | 04:05 AM