Share News

బన్ని ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోండి

ABN , Publish Date - Oct 15 , 2026 | 12:19 AM

దేవరగట్టు బన్ని ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కలెక్టర్‌ ఎ. సిరి, ఎస్పీ విక్రాంత్‌పాటిల్‌, ఆదోని ఏఎస్పీ జయశర్మ అన్నారు.

   బన్ని ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోండి
దేవరగట్టులో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఎ.సిరి

ఘర్షణలకు పాల్పడితే కఠిన చర్యలు

కలెక్టర్‌ ఎ. సిరి, ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌

హొళగుంద, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): దేవరగట్టు బన్ని ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కలెక్టర్‌ ఎ. సిరి, ఎస్పీ విక్రాంత్‌పాటిల్‌, ఆదోని ఏఎస్పీ జయశర్మ అన్నారు. బుధవారం వారు దేవరగట్టు మాల మల్లేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం నెరణికి, నెరణికితండా, కొత్తపేట గ్రామాల ప్రజలతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ బన్ని ఉత్సవాల్లో భాగంగా సంప్రదాయం పేరుతో కొట్టుకోకుండా ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విద్యుత్‌, తాగునీరు, వైద్యాధికారులు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్పీ మాట్లాడుతూ కక్షలకు, ప్రతీకారాలకు పాల్పడ్డానికి రింగు కర్రలను తీసుకురాకూడదన్నారు. గ్రామాల ప్రజలు, గ్రామపెద్దలు పరస్పరం సహకరించుకుంటూ బన్ని ఉత్సవాన్ని ఎలాంటి అపశ్రుతులు లేకుండా ప్రశాంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో పత్తికొడ డీఎస్పీ వంశీధర్‌గౌడ్‌, ఆదోని ఆర్డీఓ అరుణాదేవి, హొళగుంద ఎస్‌ఐ దిలీప్‌కుమార్‌, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - Oct 15 , 2026 | 12:19 AM