Minister Kondapalli Srinivas: ఎంఎస్ఎంఈల బలోపేతానికి ‘సీడీపీ’
ABN , Publish Date - Jan 10 , 2026 | 06:17 AM
రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ(ఎంఎ్‌సఎంఈ)లను అభివృద్ధిపరిచే లక్ష్యంతో రూ.200 కోట్ల అంచనా వ్యయంతో ’ఆంధ్రప్రదేశ్ క్లస్టర్...
రూ.200 కోట్లతో క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమం: మంత్రి కొండపల్లి
అమరావతి, జనవరి 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ(ఎంఎ్‌సఎంఈ)లను అభివృద్ధిపరిచే లక్ష్యంతో రూ.200 కోట్ల అంచనా వ్యయంతో ’ఆంధ్రప్రదేశ్ క్లస్టర్ డెవల్‌పమెంట్ ప్రోగ్రాం(ఏపీ-సీడీపీ)’కు రూపకల్పన చేశామని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. మంత్రివర్గం ఆమోదం పొందిన ఈ కార్యక్రమం ద్వారా రాబోయే ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 45 కామన్ ఫెసిలిటీ సెంటర్లు (సీఎఫ్‌సీ) స్థాపిస్తామన్నారు. ఈ కేంద్రాలు 1,840 ఎంఎ్‌సఎంఈ యూనిట్లకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరుస్తాయని.. తద్వారా 7,500 మందికిపైగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ‘సీఎం ఉపాధి కల్పన కార్యక్రమం (సీఎంఈపీజీపీ)’ ప్రారంభించేందుకు కూడా చంద్రబాబు ఆమోదం తెలిపారన్నారు. కాగా, రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ, స్వయం సహాయక సంఘాల్లో జీవనోపాధి వ్యవస్థను మరింత పటిష్ఠం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం టాటా స్ట్రైవ్‌తో వ్యూహాత్మక చర్చలు జరిపినట్లు మంత్రి శ్రీనివాస్ తెలిపారు.