‘షిర్డిసాయి’పై సీబీఐ విచారణకు ఆదేశించండి
ABN , Publish Date - Mar 19 , 2026 | 05:16 AM
షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ సంస్థ నుంచి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను కొనుగోలు చేసిన వ్యవహారంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని...
హైకోర్టులో ఏబీవీ పిల్
అమరావతి, మార్చి 18(ఆంధ్రజ్యోతి): షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ సంస్థ నుంచి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను కొనుగోలు చేసిన వ్యవహారంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని, దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు(ఏబీవీ) హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు ధర్మాసనం విచారించింది. ఆ సంస్థ సరఫరా చేసిన ట్రాన్స్‌ఫార్మర్లు, పరికరాలు టెండర్ ప్రక్రియలో నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా? లేదా? అనే విషయాన్ని నిపుణులతో పరిశీలన చేయిస్తామని పేర్కొంది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న రాష్ట్ర ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ, ఏపీఎ్‌సపీడీసీఎల్ సీఎండీ, షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ సంస్థలకు నోటీసులు జారీ చేసింది విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చల్లా గుణరంజన్‌ల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.