Share News

సస్పెన్షన్‌లోనే రిటైర్మెంట్‌!

ABN , Publish Date - Jul 01 , 2026 | 06:20 AM

సీనియర్‌ ఐపీఎస్‌ పీవీ సునీల్‌కుమార్‌ సస్పెన్షన్‌లో ఉండగానే రిటైరయ్యే పరిస్థితి ఏర్పడింది. ఆయన రిటైరైన మంగళవారమే హైదరాబాద్‌లోని..

సస్పెన్షన్‌లోనే రిటైర్మెంట్‌!

  • ఐపీఎస్‌ సునీల్‌కుమార్‌కు క్యాట్‌లో ఎదురుదెబ్బ

  • సస్పెన్షన్‌ ఎత్తివేయాలన్న పిటిషన్‌ కొట్టివేత

హైదరాబాద్‌, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): సీనియర్‌ ఐపీఎస్‌ పీవీ సునీల్‌కుమార్‌ సస్పెన్షన్‌లో ఉండగానే రిటైరయ్యే పరిస్థితి ఏర్పడింది. ఆయన రిటైరైన మంగళవారమే హైదరాబాద్‌లోని సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌(క్యాట్‌)లో భారీ ఎదురుదెబ్బ తగిలింది. తనపై ప్రభుత్వం సస్పెన్షన్‌ను ఎత్తేసి పోస్టింగ్‌ ఇవ్వడంతోపాటు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను ట్రైబ్యునల్‌ కొట్టివేసింది. సునీల్‌కుమార్‌పై తీవ్రమైన అవినీతి ఆరోపణలతోపాటు క్రమశిక్షణ, పలు నేరాలకు సంబంధించిన విచారణలు కొనసాగుతుండడంతో పదవీవిరమణ వరకు ఆయనపై సస్పెన్షన్‌ విధిస్తూ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిని ఆయన క్యాట్‌లో సవాల్‌ చేశారు. ఈ పిటిషన్‌పై మంగళవారం లతా బస్వరాజ్‌ పాట్నే, శాలినీ మిశ్రాలతో కూడిన క్యాట్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ప్రతాప్‌ నారాయణ్‌ సంఘీ వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం తరఫున ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌ సస్పెన్షన్‌కు సంబంధించిన కారణాలను రివ్యూ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించిందని.. సస్పెన్షన్‌ను సమర్థించిందని పేర్కొన్నారు.

Updated Date - Jul 01 , 2026 | 06:21 AM