New Trend: కారవాన్‌లో క్యాసినో..!?
ABN , Publish Date - Jan 15 , 2026 | 03:12 AM
సంక్రాంతి సంబరాల్లో కొత్త సంప్రదాయానికి తెరలేచింది. ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని గన్నవరం, నూజివీడు నియోజకవర్గాల్లో సంక్రాంతి సంబరాల్లో భాగంగా సంప్రదాయ కోడిపందేల...
సంక్రాంతి సంబరాల్లో కొత్త సంప్రదాయం
(నూజివీడు-ఆంధ్రజ్యోతి)
సంక్రాంతి సంబరాల్లో కొత్త సంప్రదాయానికి తెరలేచింది. ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని గన్నవరం, నూజివీడు నియోజకవర్గాల్లో సంక్రాంతి సంబరాల్లో భాగంగా సంప్రదాయ కోడిపందేల బరుల వద్ద కారవాన్ల సాక్షిగా క్యాసినోలు నిర్వహించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గన్నవరం నియోజకవర్గంలో ఐదు కారవాన్‌లు ఏర్పాటు చేయగా.. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గ పరిధిలోని మీర్జాపురంలో రెండు కారవాన్లను అందుబాటులో ఉంచారు. ఈ కారవాన్‌లో నిర్వహించే కాసినోలో పాల్గొనాలంటే లక్ష రూపాయల టోకెన్ ఉండాలనే ప్రచారం సాగుతోంది. అది కూడా ముందుగా ఎంపిక చేసిన వారిని మాత్రమే అనుమతిస్తున్నట్టు తెలిసింది. ఒక్కో కారవాన్‌లో సుమారు 15 ఆటలు సాగినట్టు, రూ.లక్షల్లో డబ్బులు చేతులు మారినట్టు సమాచారం. కారవాన్ల దరిదాపుల్లోకి వెళ్లేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే వారిని బౌన్సర్లు అడ్డుకోవడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది.