జడ శ్రావణ్‌పై 4 స్టేషన్లలో కేసుల నమోదు
ABN , Publish Date - Jul 02 , 2026 | 04:03 AM
మత విద్వేషాలు, వైషమ్యాలు రగిలిస్తూ, శాంతి భద్రతలకు భంగం కలిగించేలా రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని అందిన ఫిర్యాదు మేరకు జై భీమ్ భారత్‌పార్టీ...
డిప్యూటీ సీఎం, డిప్యూటీ స్పీకర్‌పై వ్యక్తిగత దూషణల ఫలితం
ఏలూరు క్రైం/కాళ్ల, జూలై 1(ఆంధ్రజ్యోతి): మత విద్వేషాలు, వైషమ్యాలు రగిలిస్తూ, శాంతి భద్రతలకు భంగం కలిగించేలా రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని అందిన ఫిర్యాదు మేరకు జై భీమ్ భారత్‌పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రవణ్‌కుమార్‌తోపాటు మరికొందరిపై ఏలూరు త్రీ టౌన్, కాళ్ల పోలీసు స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి. గత నెల 28న ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవ శంఖారావం బహిరంగ సభలో శ్రవణ్, యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్‌తోపాటు మరికొందరు తమ ప్రసంగాల్లో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లను వ్యక్తిగతంగా దూషించి హేళన చేశారని ఏలూరు గొల్లాయిగూడానికి చెందిన పెద్దాడ వెంకటరమణ, కాళ్ల మండలం సీసలికి చెందిన తోట ఫణిబాబు ఫిర్యాదు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు, పాలకోడేరు పోలీసు స్టేషన్లలోనూ శ్రవణ్ కుమార్‌పై ఫిర్యాదులందాయి.