Share News

క్యారియర్‌తో మరో ముందడుగు

ABN , Publish Date - May 07 , 2026 | 04:29 AM

క్యారియర్‌ సంస్థ రాకతో రాష్ట్ర పారిశ్రామిక రంగంలో మరో కీలక ముందడుగు పడిందని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రావడం ఆనందంగా ఉందన్నారు.

క్యారియర్‌తో మరో ముందడుగు

  • శ్రీసిటీలో ప్రాజెక్టు భూమి పూజపై సీఎం చంద్రబాబు

అమరావతి, మే 6(ఆంధ్రజ్యోతి): క్యారియర్‌ సంస్థ రాకతో రాష్ట్ర పారిశ్రామిక రంగంలో మరో కీలక ముందడుగు పడిందని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రావడం ఆనందంగా ఉందన్నారు. సీఎం ఎక్స్‌లో స్పందిస్తూ.. ‘ప్రముఖ అంతర్జాతీయ సంస్థ క్యారియర్‌ తన అత్యాధునిక చిల్లర్‌ తయారీ కేంద్రాన్ని శ్రీసిటీలో ఏర్పాటు చేసేందుకు బుధవారం భూమి పూజ నిర్వహించింది. సుమారు రూ. 863 కోట్ల భారీ పెట్టుబడితో నిర్మించనున్న ఈ ప్లాంట్‌, రాష్ట్రంలో హైఎండ్‌ పారిశ్రామిక కూలింగ్‌ సిస్టమ్స్‌ రంగాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఈ కేంద్రంలో ప్రధానంగా 1,500 టీఆర్‌ కంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన కమర్షియల్‌ హెచ్‌వీఏసీ చిల్లర్లను తయారు చేస్తారు. పరిశోధన, అభివృద్ధి కోసం 15 అత్యాధునిక టెస్టింగ్‌ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. కేవలం డేటా సెంటర్లను ఆకర్షించడమే కాకుండా, పెరుగుతున్న ఏ1 ఎకానమీకి అవసరమైన పూర్తిస్థాయి మాన్యుఫ్యాక్చరింగ్‌ ఎకో సిస్టమ్‌ను నిర్మించాలనే ఏపీ ప్రభుత్వ లక్ష్యానికి ఈ ప్రాజెక్టు నిదర్శనం’ అని పోస్టు చేశారు. ఈ కీలక విజయంలో ప్రధాన పాత్రధారి అయిన మంత్రి లోకేశ్‌కు సీఎం అభినందనలు తెలిపారు.

Updated Date - May 07 , 2026 | 04:29 AM