Share News

శ్రీసిటీకి ‘క్యారియర్‌’!

ABN , Publish Date - May 04 , 2026 | 04:17 AM

అమెరికాకు చెందిన దిగ్గజ ఎయిర్‌ కండిషనర్‌ తయారీ సంస్థ ‘క్యారియర్‌’.. శ్రీసిటీలో ఉత్పత్తి సంస్థను ప్రారంభించనుంది. దాదాపు రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో...

శ్రీసిటీకి ‘క్యారియర్‌’!

  • వెయ్యి కోట్లతో ఏసీల పరిశ్రమ పెట్టనున్న దిగ్గజ సంస్థ

  • ఎల్లుండి శంకుస్థాపన.. హాజరుకానున్న లోకేశ్‌

తిరుపతి, మే 3(ఆంధ్రజ్యోతి): అమెరికాకు చెందిన దిగ్గజ ఎయిర్‌ కండిషనర్‌ తయారీ సంస్థ ‘క్యారియర్‌’.. శ్రీసిటీలో ఉత్పత్తి సంస్థను ప్రారంభించనుంది. దాదాపు రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో గృహేతర వినియోగానికి సంబంధించిన భారీ ఏసీలను తయారు చేయనుంది. శ్రీసిటీలో ఈ సంస్థకు సుమారు 40 ఎకరాలు కేటాయించారు. బుధవారం (6న) శంకుస్థాపన జరుగనుంది. రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్‌ హాజరు కానున్నారు. క్యారియర్‌ సంస్థ సీఎండీ డేవిడ్‌ గిట్లిన్‌ కూడా వస్తున్నట్లు తెలిసింది. ఈ పరిశ్రమతో వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మరో రెండు వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని తిరుపతి జిల్లా కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ తెలిపారు.

Updated Date - May 04 , 2026 | 04:18 AM