స్కూటర్‌ను ఢీకొన్న కారు..
ABN , Publish Date - Feb 04 , 2026 | 11:03 PM
స్కూటర్‌ను కారు ఢీకొన్న ఘటనలో ఓ బీటెక్ విద్యార్థి దుర్మరణం చెందాడు. ఈ ఘటన ఆదోని-ఎమ్మిగనూరు బైపాస్ బైచిగేరి సమీపంలో చోటుచేసుకున్నట్లు తాలుకా ఎస్‌ఐ రామాంజనేయులు తెలిపారు.
బీటెక్ విద్యార్థి దుర్మరణం
ఆదోని రూరల్, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి) : స్కూటర్‌ను కారు ఢీకొన్న ఘటనలో ఓ బీటెక్ విద్యార్థి దుర్మరణం చెందాడు. ఈ ఘటన ఆదోని-ఎమ్మిగనూరు బైపాస్ బైచిగేరి సమీపంలో చోటుచేసుకున్నట్లు తాలుకా ఎస్‌ఐ రామాంజనేయులు తెలిపారు. వివరాలు.. ఆదోని పట్టణంలోని హౌసింగ్ బోర్డుకాలనీలో నివాసం ఉంటున్న హను మంతు, జయలక్ష్మీ కుమారుడు పవనకుమార్(30) ఎమ్మిగనూరు మండలం ఎర్రకోట ఇంజనీరింగ్ కళాశాలలో ఎంబీఏ ఫస్టియర్ చదువుతున్నాడు. బుధవారం ఆదోని మండలం పెసలబండలో జరిగిన దేవరకు వెళ్లి సాయంత్రం ఆదోనికి వస్తున్నాడు. బైచిగేరి వద్ద కర్ణాటకకు చెందిన కారు వెనుకనుంచి ఢీకొట్టింది. అతడు అక్కడికక్కడే మరణించాడు. దుర్ఘటన జరిగిన వెంటనే కారు డ్రైవర్ ప్రశాంత పరారయ్యాడు. తాలుక ఎస్‌ఐ ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి. కొడుకు అకాల మరణంతో తల్లి కుప్పకూలింది. కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.