Share News

అభ్యర్థులు ఖరారు

ABN , Publish Date - Oct 22 , 2026 | 12:00 AM

నగర, పురపాలక సంఘాల ఎన్నికల్లో అసలు సిసలైన సమరంలో ఆరంభమైంది. బరిలో నిలబడి అభ్యర్థులు ఎవరో ఖరారు అయ్యింది.

అభ్యర్థులు ఖరారు

పుర పోరులో కదిలిన ప్రచార రథాలు

కర్నూలు మేయర్‌ బరిలో 13 మంది

టీడీపీ అభ్యర్థి బొల్లెద్దుల విజయ ప్రత్యూష

టీడీపీ చైర్మన అభ్యర్థులు ఆదోనిలో నాగమణి, ఎమ్మిగనూరులో సునీత

గూడూరు బీజేపీ అభ్యర్థిగా డమాం సునీతాబాయి

కర్నూలు, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): నగర, పురపాలక సంఘాల ఎన్నికల్లో అసలు సిసలైన సమరంలో ఆరంభమైంది. బరిలో నిలబడి అభ్యర్థులు ఎవరో ఖరారు అయ్యింది. దీనితో ప్రజా క్షేత్రంలో అసలైన సమరం ప్రారంభమైంది. బుధవారం వితడ్రా పర్వం ముగిసింది. మేయర్‌, చైర్మన స్థానాలు, కార్పొరేటర్లు, కౌన్సిలరు అభ్యర్థులను ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈ నెల 28న ఓటర్ల తీర్పు ఉంటుంది. 26వ తేది సాయంత్రం వరకు ప్రచారం చేయాల్సి ఉంటుంది. ఇక మిగిలింది ఐదు రోజులే. సమయం తక్కువ.. ప్రచారం చేయాల్సిన వార్డులు ఎక్కువగా ఉండడంతో మేయర్‌, చైర్మన అభ్యర్థులు కాళ్లకు చక్రాలు కట్టుకుని ప్రచారంలో పరుగులు తీస్తున్నారు. చీకటి పడినా ఇంటింటికి వెళ్లి ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు రాజకీయ పార్టీల్లో సందడి కనిపిస్తే.. ప్రచార రథాలు కదలడంతో వీధుల్లో ఎన్నికల సందడి మొదలైంది. టీడీపీ మేయర్‌ అభ్యర్థి బొల్లెద్దుల విజయప్రత్యూష మంత్రి టీజీ భరత, టీడీపీ నాయకులతో కలసి విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఎమ్మిగనూరు టీడీపీ చైర్మన అభ్యర్థి మాచాని సునీత తన భర్త, టీడీపీ పట్టణ అధ్యక్షుడు మాచాని మహేశకుమార్‌తో ప్రచార వేగం పెంచారు. ఆదోని చైర్మన అభ్యర్థి తల్లపనేని నాగమణి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్‌ నాయకుడు, ఇనచార్జి కె.మీనాక్షినాయుడు, ఎమ్మెల్యే డాక్టర్‌ పార్థసారథి ఆశీస్సులతో ప్రజాక్షేత్రంలో చురుగ్గా వెళ్తున్నారు. ఏ వార్డుకు వెళ్లినా టీడీపీ మేయర్‌, చైర్మన, కార్పొరేటర్‌, కౌన్సిలర్‌ అభ్యర్థులకు ప్రజల నుంచి సానుకూల స్పందన లభిస్తోంది.

పోటీదారులు ఖరారు:

ఫ కర్నూలు నగరపాలక సంస్థ మేయర్‌ స్థానానికి 13 మంది, 67 వార్డులకు కార్పొరేటర్లుగా 299 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మేయర్‌ టీడీపీ అభ్యర్థిగా బొల్లెద్దుల విజయ ప్రత్యూష, వైసీపీ అభ్యర్థి యు. సుశీల, కాంగ్రెస్‌ అభ్యర్థిగా కల్లమల తామరదేవి, సీపీఎం అభ్యర్థిగా బి. శ్యామలతో పాటు మరో తొమ్మిది మంది పోటీలో ఉన్నారు. టీడీపీ, వైసీపీ అభ్యర్థులు వరుసకు అత్తా కోడళ్లు అవుతారు. 53వ వార్డు టీడీపీ కార్పొరేటర్‌ అభ్యర్థి కె. చంద్రశేఖర్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఫ ఆదోని మున్సిపాలిటీ చైర్మన కూటమి టీడీపీ అభ్యర్థి టి. నాగమణి, వైసీపీ అభ్యర్థిగా గాజుల ప్రణతి, కూటమి రెబల్‌గా స్వతంత్ర అభ్యర్థిగా స్వప్న నాయకర్‌తో పాటు మరో ఐదుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. 52 వార్డులకు మంది పోటీలో నిలిచారు.

ఫ ఎమ్మిగనూరు మున్సిపల్‌ చైర్మన కూటమి టీడీపీ అభ్యర్థి మాచాని సునీత, వైసీపీ అభ్యర్థి కేఎస్‌ రఘుతో పాటు ఆరుగురు పోటీలో మిగిలారు. ఇక్కడ 44 వార్డులకు కౌన్సిలరు అభ్యర్థులుగా మంది పోరుకు సై అన్నారు.

ఫ గూడూరు నగర పంచాయతీ చైర్మన కూటమి బీజేపీ అభ్యర్థి డమాం సునీతాబాయి, వైసీపీ అభ్యర్థి ఎల్‌. పద్మావతి ఇద్దరు మాత్రమే పోటీలు ఉన్నారు. నామినేషన్ల వేసిన ఆరుగురు వితడ్రా చేసుకున్నారు. 23 వార్డులకు పోటీలో మంది అభ్యర్థులు మాత్రమే మిగిలారు.

Updated Date - Oct 22 , 2026 | 12:00 AM