క్యాన్సర్ బాధిత చిన్నారికి సాంకేతిక విద్య ఉద్యోగుల సాయం
ABN , Publish Date - Sep 28 , 2026 | 06:41 AM
బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఏడాది చిన్నారికి సాంకేతిక విద్యాశాఖ ఉద్యోగులు చేయూతనందించారు.
అమరావతి, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఏడాది చిన్నారికి సాంకేతిక విద్యాశాఖ ఉద్యోగులు చేయూతనందించారు. గుంటూరుకు చెందిన గోపి, పావని దంపతుల కుమార్తె గాయత్రి బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతోంది. వైద్య ఖర్చులు భారీగా అవుతున్నందున ఆర్థిక సాయం చేయాలని ఆ కుటుంబం దాతలను కోరుతోంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న సాంకేతిక విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, ఇతర ఉద్యోగులు కలిసి రూ.1.25 లక్షలు సమీకరించి ఆదివారం గుంటూరులో చిన్నారి తల్లిదండ్రులకు అందజేశారు.