బుజ్జగింపులు
ABN , Publish Date - Oct 05 , 2026 | 11:32 PM
మద్యం షాపుల టెండర్లకు దరఖాస్తు చేసుకోవాలని మద్యం షాపుల యజమానులను అధికారులు బుజ్జగిస్తున్నారు.
మద్యం షాపులు మాకొద్దు అంటున్న వ్యాపారులు
దరఖాస్తులు వేయించేందుకు కసరత్తు
ఉమ్మడి జిల్లా తిష్ఠ వేసిన ఉన్నతాధికారులు
లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు పావులు
తలలు పట్టుకుంటున్న అధికారులు
కర్నూలు అర్బన, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): మద్యం షాపుల టెండర్లకు దరఖాస్తు చేసుకోవాలని మద్యం షాపుల యజమానులను అధికారులు బుజ్జగిస్తున్నారు. మద్యం షాపులు మాకొద్దు బాబోయ్ అంటూ వారు చేతులెతేస్తున్నారు. దరఖాస్తులు వేయించాలని ఎక్సైజ్ శాఖ అఽధికార్లు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బృందాలుగా విడిపోయి ఆసక్తి ఉన్న వారిని గుర్తించి దరఖాస్తులు వేయించే కసరత్తు ముమ్మరం చేశారు. విపరీతంగా పెరిగిన రెన్యువల్ రెంటల్, బెల్టుషాపుల బెడద, కర్ణాటక టెట్రా ప్యాకెట్లు, రాజకీయ జోక్యంతో షాపులు నడపడం కష్టంగా మారిందని పలువురు ఆరోపిస్తున్నారు. ఎక్సైజ్ శాఖ గతనెల 23న కొత్త లైసెన్సల కోసం నోటిఫికేషన్ జారీచేసింది. ఈనెల 6న దరఖాస్తుల స్వీకరణకు గడువు ముగి యనుంది. పూర్తిస్థాయిలో దరఖాస్తులు అనుమానంగానే ఉంది. 8న కలెక్టర్ లాటరీ విధా నంలో షాపులను ఎంపిక చేయాల్సి ఉంది. ఈక్రమంలో రాష్ట్రస్థాయి ఎక్సైజ్ శాఖ జాయింట్ కమిషనర్ నాగలక్ష్మి ఉమ్మడి జిల్లాలో తిష్ఠవేసి దరఖాస్తుల ప్రక్రియ పూర్తిచేయాలనే లక్ష్యంతో పావులు కదుపుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో 44 షాపులకు గానూ..
ఉమ్మడి జిల్లాలో 44 మద్యం షాపులకు గానూ 21దుకాణాలకు దరఖాస్తులకు యజమా నులు ఆసక్తి చూపడం లేదని సమాచారం. నంద్యాల 16, కర్నూలు-6 షాపులకు దరఖాస్తులు వేసేందుకు ససేమిరా అంటున్నట్లు ఎక్సైజ్ సిబ్బంది చర్చించుకుంటోంది. మొత్తంగా 10శాతం గీత కులాలకు కేటాయించిన షాపుల లైసెన్సీలు ఇబ్బందికరంగా తయారైందని కొంతమంది మద్యం షాపుల యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు.
కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని..
2026-27 సంవత్సరానికి మద్యం షాపులకు టెండర్ల ప్రక్రియను పక్కన పెట్టి రెన్యువల్‌కు ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. సెప్టెంబరు 12న కర్నూలు 106, నంద్యాల జిల్లాలో 116 మొత్తంగా 222 షాపులకు రెన్యువల్‌కు నోటిఫికేషన జారీచేశారు. కర్నూల్లో 92, నంద్యాలలో 89 మొత్తంగా 181 షాపులకు రెన్యువల్ ప్రక్రియను గతనెల 30వ తేదీ లోపు అధికారులు పూర్తిచేయించారు. ఫలితంగా ప్రభుత్వానికి రూ.80కోట్ల ఆదాయం సమకూరింది. ఈక్రమంలో నంద్యాల్లో 27, కర్నూలు జిల్లాలో 17 కలిపి మొత్తం 44 షాపులకు సంబంధించి రెన్యువల్‌కు ఎవరూ ముందుకు రాకపోవడంతో గతనెల 23న మరోసారి టెండర్ల ప్రక్రియకు ప్రభుత్వం కొత్తగా దరఖాస్తులు చేసుకోవాలని నోటిఫికేషన్ జారీచేసింది.
రెన్యువల్ రెంటల్‌తో ..
గతంలో రూ.71.50లక్షలు ఉండగా దీనిపై కొత్త లైసెన్సీ జారీ ప్రక్రియలో ఒక్కో షాపుకు 38 శాతం అదనంగా రెన్యువల్ రెంటల్, రెంటల్ కొత్త లైసెన్సీ కింద రూ.1.06 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. ప్రతిరోజు ఒక్కో షాపునకు రూ.3లక్షల వ్యాపారం జరిగితే తప్ప గిట్టుబాటు కానీ పరిస్థితి అని వ్యాపారులు పేర్కొంటున్నారు. మద్యం షాపుల ప్రక్రియలో పలుచోట్ల రెన్యు వల్‌కు ముందుకు వెళ్లకుండా ఉన్న షాపులకు పలుచోట్ల సిండికెట్‌గా మారి వాటాలు పం చుకునే దిశగా అడుగులు వేసినట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాలో 44 షాపులకు రెన్యువల్ ప్రక్రియ అటకెక్కిందనే ప్రచారం ఉంది. ఉన్న షాపులకు పర్మిట్ రూమ్‌ల అనుమతులతో అతికష్టం మీద నెట్టుకొస్తున్నామంటున్నారు.
కొలిక్కి రాకపోవడంతో..
2024-25 లైసెన్సీ ప్రక్రియలో మద్యం షాపుల కేటాయింపులో జనాభా ప్రతిపాదికన షాపు ల కేటాయింపులు చేశారు. అదనంగా గీతకులాలకు కేటాయించిన షాపుల మధ్య జరిగిన పొరపాట్లు యజమానులకు ఇబ్బందికరంగా మారాయి. ఎమ్మిగనూరు రూరల్-3 పత్తికొండ-5 ఇలా పలు చోట్ల ఉమ్మడి జిల్లాలో షాపుల కేటాయింపులో ఇబ్బందులు ఎక్సైజ్ అధికారులకు తలనొప్పిగా తయారయ్యాయి. కొత్త లైసెన్సీ ప్రక్రియను పూర్తిచేసేందుకు చేస్తున్న ప్రయ త్నాలు కొలిక్కి రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.
విజయవంతం చేస్తాం
అన్ని మద్యం షాపులకు దరఖాస్తులు వస్తాయనే ఆశాభావంతో ఉన్నాం. సీఐలు ప్రతి స్టేష న్ల వారీగా సమావేశాలు నిర్వహించి పాత వారిని గుర్తించి వారి సంప్రదిస్తున్నాం. టెండర్లలో పాల్గొని అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని కోరాం. ఉమ్మడి జిల్లాలో వంద శాతం విజయవంతం చేస్తాం. ఇబ్బందేమీ లేదు.
ఫ పి. శ్రీదేవి, డిప్యూటీ కమిషనర్, ఎక్సైజ్ శాఖ