చిన్న వ్యాపార సంస్థల బలోపేతమే లక్ష్యం
ABN , Publish Date - Mar 10 , 2026 | 05:45 AM
సూక్ష్మ, నానో వ్యాపార సంస్థలను విస్తరించి, వాటిని బలోపేతం చేయాలనే లక్ష్యంతో భారతీయ యువ శక్తి ట్రస్ట్ (బీవైఎస్‌టీ) సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.
ప్రభుత్వంతో బీవైఎ్‌సటీ ఒప్పందం
విజయవాడ సిటీ, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): సూక్ష్మ, నానో వ్యాపార సంస్థలను విస్తరించి, వాటిని బలోపేతం చేయాలనే లక్ష్యంతో భారతీయ యువ శక్తి ట్రస్ట్ (బీవైఎస్‌టీ) సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలకు అవసరమైన ఆర్ధిక లభ్యత, మార్గదర్శకత్వం, శిక్షణ ఇస్తుంది. ఈ మేరకు ఏపీ ఎంఎ్‌సఎంఈ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ సీఈవో విశ్వ సమక్షంలో ఎంవోయూ జరిగింది. ఆ పత్రాలతో సోమవారం సచివాలయంలో బీవైఎస్‌టీ ప్రతినిధి అరుణ, సీఎం చంద్రబాబును కలిశారు. ఒక కుటుంబం.. ఒక పారిశ్రామిక వేత్త అనే ప్రభుత్వం నినాదానికి అనుగుణంగా పని చేస్తామని ఆ సంస్థ తెలిపింది.