B.V. Raghavulu: అమరావతిని జగన్ అంగీకరించాలి
ABN , Publish Date - Jan 12 , 2026 | 06:42 AM
రాజధాని అమరావతి అంశాన్ని వివాదాస్పదం చేయడం అర్థరహితమని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పేర్కొన్నారు.
సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు
అమరావతి, జనవరి 11(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి అంశాన్ని వివాదాస్పదం చేయడం అర్థరహితమని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పేర్కొన్నారు. జగన్ ఆ పద్ధతికి స్వస్తి పలికి అమరావతిని రాజధానిగా అంగీకరించాలని హితవు పలికారు. అమరావతి అభివృద్ధికి అవసరమైన సూచనలు చేయాలని సూచించారు. పనుల్లో లోపాలుంటే విమర్శలు చేయాలి గానీ, స్థలాన్నే వివాదం చేయడం సరికాదన్నారు. ఆదివారం విజయవాడ బాలోత్సవ్ భవన్‌లో ఆయన మాట్లాడారు. భూ సమీకరణను తాము మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నామన్నారు.