జగన్‌కు రాజకీయ పరిపక్వత లేదు
ABN , Publish Date - Apr 10 , 2026 | 04:04 AM
జగన్‌కు రాజకీయ పరిపక్వత లేదు. గన్నులన్నీ అయిపోయాక ఇప్పుడు మావిగన్ ఎందుకు? ఐదేళ్లూ గుర్తుకు రాలేదా..? అధికారం పోయాక గుర్తుకు వచ్చిందా.
అమరావతికి సహకరించాలి.. లేదంటే ఇంట్లో కూర్చోవాలి: బీవీ రాఘవులు
పుట్టపర్తి, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): ‘జగన్‌కు రాజకీయ పరిపక్వత లేదు. గన్నులన్నీ అయిపోయాక ఇప్పుడు మావిగన్ ఎందుకు? ఐదేళ్లూ గుర్తుకు రాలేదా..? అధికారం పోయాక గుర్తుకు వచ్చిందా..?’ అని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు నిలదీశారు. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో గురువారం మీడియాతో మాట్లాడుతూ ‘12 ఏళ్లు గడిచినా రాష్ట్రాన్ని స్థిర పరుచుకోలేకపోయాం. దానికి మొదట జగన్, తర్వాత చంద్రబాబు సిగ్గుపడాలి. ఇప్పుడు అమరావతిని స్థిరపరచాలనే ప్రయత్నాలు సాగుతున్నాయి. దానికి జగన్ సహకరించాలి.. లేదంటే ఇంట్లో కూర్చోవాలి. గన్నులు, తూటాలంటూ అడ్డుపుల్లలు వేయడం సరికాదు. మొదట్లో అమరావతిని సమర్థించిన జగన్.. అధికారంలోకి రాగానే 3 రాజధానులన్నారు. అధికారం పోయాక ఆ మూడింటినీ వదిలేసి మావిగన్ అంటున్నారు’ అంటూ విరుచుకుపడ్డారు.