వైసీపీ నిరసన.. దున్నపోతులు పరార్..!
ABN , Publish Date - Jun 13 , 2026 | 06:00 AM
రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనకు నిరసనగా ఆందోళన చేపట్టిన వైసీపీ నాయకులకు నిరాశే ఎదురైంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో చేపట్టిన ఆందోళన సందర్భంగా..
నందిగామ, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనకు నిరసనగా ఆందోళన చేపట్టిన వైసీపీ నాయకులకు నిరాశే ఎదురైంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో చేపట్టిన ఆందోళన సందర్భంగా కూటమి ప్రభుత్వానిది ‘దున్నపోతు పాలన’ అన్నట్టు చూపించేందుకు వైసీపీ నాయకులు చేసిన ప్రయత్నం వికటించింది. ఈ నిరసన కోసం రెండు దున్నపోతులను తీసుకొచ్చిన వైసీపీ నాయకులు వాటికి చంద్రబాబు ఫొటోలతో ఉన్న కరపత్రాలు పెట్టి ర్యాలీ ప్రారంభించారు. అయితే వైసీపీ నాయకుల అరుపులు, కేకలకు బెదిరిపోయిన ఆ దున్నపోతులు బెదిరిపోయి అక్కడి నుంచి పరుగు లంఘించాయి. దీంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు చెల్లాచెదురయ్యారు. కొద్ది సేపటికి... రైతులు వాటిని ఎలాగోలా అదుపుచేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.