Share News

అవసరమైనప్పుడే కులం గుర్తొస్తుందా?

ABN , Publish Date - Feb 03 , 2026 | 05:06 AM

అవసరమైనప్పుడే కులం గురించి మాట్లాడతారా? ఇదేనా మీ తండ్రి మీకు చెప్పింది? అని వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభరెడ్డిని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న నిలదీశారు.

అవసరమైనప్పుడే కులం గుర్తొస్తుందా?

  • అంబటి బూతులను ముద్రగడ సమర్థిస్తున్నారా?

  • బుద్దా వెంకన్న బహిరంగ లేఖ

విజయవాడ అర్బన్‌, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): అవసరమైనప్పుడే కులం గురించి మాట్లాడతారా? ఇదేనా మీ తండ్రి మీకు చెప్పింది? అని వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభరెడ్డిని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న నిలదీశారు. ఆయన ముద్రగడకు సోమవారం బహిరంగ లేఖ రాశారు. ‘కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్‌కల్యాణ్‌ తల్లిని, భార్యను వైసీపీ నేతలు దూషించినప్పుడు మీకు కులం గుర్తుకు రాలేదా? కాపు నేత నారాయణపై తప్పుడు కేసులతో వేధించినప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు?’ అని నిలదీశారు. తనకు అండగా నిలిచింది గవర సామాజికవర్గమని చెప్పే ముద్రగడ.. అదే వర్గానికి చెందిన తనపై మాచర్లలో హత్యాయత్నం జరిగినప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ‘చంద్రబాబు సతీమణిని అసెంబ్లీలో అవమానించినప్పుడు, ఆయన ఇంటిపై జోగి రమేశ్‌ దాడి చేసినప్పుడు జగన్‌కు ఎందుకు లేఖ రాయలేదు’ అని నిలదీశారు. అంబటి రాంబాబు వాడిన బూతులను సమర్థిస్తున్నారా? అని ప్రశ్నించారు.

Updated Date - Feb 03 , 2026 | 05:07 AM