బెజవాడ అల్లర్ల సూత్రధారి జగన్
ABN , Publish Date - Sep 24 , 2026 | 05:44 AM
విజయవాడలో శాప్ కార్యాలయం వద్ద జరిగిన అల్లర్లకు జగన్ సూత్రధారి అని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న పేర్కొన్నారు. ఈ కేసులో జగన్‌ను కుట్రదారుడిగా చేర్చాలని డిమాండ్ చేశారు. దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేస్తానని చెప్పారు.
బెజవాడ అల్లర్ల సూత్రధారి జగన్
వెలంపల్లి, మల్లాది విష్ణు ఆకు రౌడీలు
గేట్లు మూయకుంటే టీచర్లను చంపేసేవారు!
డీజీపీకి ఫిర్యాదు చేస్తా: బుద్దా వెంకన్న
విజయవాడ అర్బన్, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): విజయవాడలో శాప్ కార్యాలయం వద్ద జరిగిన అల్లర్లకు జగన్ సూత్రధారి అని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న పేర్కొన్నారు. ఈ కేసులో జగన్‌ను కుట్రదారుడిగా చేర్చాలని డిమాండ్ చేశారు. దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. బుధవారం విజయవాడలోని తన కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేవినేని అవినాశ్, వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు ఆకు రౌడీలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ ప్రజలను భయపెడుతున్నారని మండిపడ్డారు. పోలీసులు గేట్లు మూసి, తాళాలు వేయకపోతే ఉపాధ్యాయులను ఈ ఆకురౌడీలు చంపేసేవారని వాపోయారు. డీఎస్సీలో కష్టపడి ఉద్యోగాలు తెచ్చుకుంటే, వారిపై ఎందుకు పగ అని వైసీపీ నాయకులను ప్రశ్నించారు.
రాష్ట్రంలో అలజడి సృష్టించాలని వైసీపీ నాయకులకు జగన్ చెబుతుంటే, వాళ్లు దాడి చేస్తున్నారన్నారు. వారందరినీ జగన్ తాడేపల్లి ప్యాలెస్‌లో ఉంచి కాపాడుతున్నాడని ఆరోపించారు. తలశిల రఘురామ్, దేవినేని అవినాశ్, మరికొందరు నాయకులు తాడేపల్లి ప్యాలె్‌సలో దాక్కున్నారన్నారు. జగన్ ఏ ముఖం పెట్టుకుని గవర్నర్‌ను కలుస్తారని ప్రశ్నించారు. సిగ్గులేకుండా గవర్నర్‌కు కూడా అబద్ధాలు చెప్తాడా? అని నిలదీశారు. జగన్ నీచబుద్ధిని రాష్ట్ర ప్రజలు గమనించరని అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు.. రాష్ట్రంలో అల్లర్లకు పాల్పడే వైసీపీ నాయకుల సంగతి పోలీసులు తేల్చాలని డిమాండ్ చేశారు. అమాయక ఉపాధ్యాయులపై దాడి చేయించిన జగన్‌ను అరెస్ట్ చేయాలని డీజీపీకి తాను ఫిర్యాదు చేయునున్నట్టు తెలిపారు.