పరామర్శల పేరుతో ఊరేగుతున్న జగన్
ABN , Publish Date - Feb 07 , 2026 | 05:01 AM
పరామర్శల పేరుతో పులివెందుల ఎమ్మెల్యే జగన్ రోడ్డుమీద ఊరేగారు. గంజాయి బ్యాచ్‌ను తీసుకువచ్చి నానా హంగామా చేస్తున్నారు.
జనాలకు డబ్బులిచ్చి తరలింపు: బుద్దా వెంకన్న
విజయవాడ అర్బన్, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): ‘పరామర్శల పేరుతో పులివెందుల ఎమ్మెల్యే జగన్ రోడ్డుమీద ఊరేగారు. గంజాయి బ్యాచ్‌ను తీసుకువచ్చి నానా హంగామా చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం పర్యటనకు జనాలకు డబ్బులిచ్చి తరలించారు’ అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న ఆరోపించారు. జగన్‌రెడ్డి ఇబ్రహీంపట్నం పర్యటనపై శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ‘జగన్ పరామర్శల పేరుతో అరాచకం చేస్తున్నాడు. జోగి రమేశ్ ఇంటి దగ్గర పెట్రోల్ బాంబ్‌లు వేసింది వైసీపీ నాయకులే. అధికారంలోకి వస్తే కూటమి నాయకులను లోపల వేయిస్తామంటున్న వైసీపీ నాయకు లు జీవితంలో అధికారంలోకి రారు. రాష్ర్టాన్ని నాశనం చేయటానికి జిల్లాకు ఒక వైసీపీ నాయకుడు తయారయ్యాడు. చంద్రబాబు ఇంటిమీద దాడి చేసినప్పుడే జోగి రమేశ్‌ను సస్పెండ్ చేసి ఉంటే ఈ రోజు ఇటువంటి పరిస్థితులు వచ్చేవి కావు’ అని బుద్దా అన్నారు.