దేశ రాజకీయాల్లో సూపర్‌స్టార్ చంద్రబాబు
ABN , Publish Date - Apr 21 , 2026 | 06:07 AM
భారతదేశ రాజకీయాల్లో తెలుగుజాతి గర్వించదగ్గ సూపర్‌స్టార్ నారా చంద్రబాబు నాయుడని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న అన్నారు.
టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న
విజయవాడ అర్బన్, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): భారతదేశ రాజకీయాల్లో తెలుగుజాతి గర్వించదగ్గ సూపర్‌స్టార్ నారా చంద్రబాబు నాయుడని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న అన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు 76వ పుట్టినరోజు సందర్భంగా సోమవారం విజయవాడ రథం సెంటర్‌లోని చంద్రబాబు కటౌట్ వద్ద ఆయన ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో బుద్దా కేక్ కట్‌చేసి పంచిపెట్టారు. ఏపీ నూర్‌బాషా చైర్మన్ కె.నాగుల్‌మీరా, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.