Share News

హిందూధర్మ వ్యతిరేకి జగన్‌!

ABN , Publish Date - Feb 26 , 2026 | 05:00 AM

హిందూ ధర్మ వ్యతిరేకి జగన్‌ అని ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ బుచ్చిరాం ప్రసాద్‌ ఆరోపించారు.

హిందూధర్మ వ్యతిరేకి జగన్‌!

  • తిరుమల భక్తులకు క్షమాపణ చెప్పాలి: బుచ్చిరాం ప్రసాద్‌

అమరావతి, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): హిందూ ధర్మ వ్యతిరేకి జగన్‌ అని ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ బుచ్చిరాం ప్రసాద్‌ ఆరోపించారు. బుధవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జగన్‌ పులివెందులలో మరో మహాపచారానికి పాల్పడ్డారన్నారు. నందిపల్లిలోని నందేశ్వరాలయంలో నూతన విగ్రహ ప్రతిష్ట కుంభాభిషేకంలో పాల్గొన్న జగన్‌ పూజారులు ఇచ్చిన తీర్ధాన్ని స్వీకరించకుండా కిందపారబోశారని, అగ్నిగుండంలో వేయటానికి పూజారులు ఇచ్చిన హవిస్సులను తిరిగి వారికే ఇచ్చేసి మహాపచారానికి పాల్పడ్డారని విమర్శించారు. తిరుమల ప్రసాదాల కుంభకోణాన్ని, పరకామణి చోరులను జగన్‌ సమర్థించారని ఆయన తక్షణమే భక్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Feb 26 , 2026 | 05:00 AM