Share News

వ్యక్తి దారుణ హత్య?

ABN , Publish Date - Nov 09 , 2026 | 11:51 PM

లావేరు మండలం తాళ్లవలసలో అనుమానాస్పద స్థితిలో మృతదేహం కనిపించింది. నేలబావిలో తల, మొండెం వేర్వేరుగా ఉండడం కలకలం సృష్టించింది. లావేరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతుడిని అప్పాపురం గ్రామానికి చెందిన కె.అసిరినాయుడు (33)గా గుర్తించారు. ఈనెల 2న అసిరినాయుడు అదృశ్యమైనట్టు లావేరు పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఇంతలోనే తాళ్లవలస సమీపంలో వ్యవసాయ నేలబావిలో మృతదేహం బయటపడింది.

వ్యక్తి దారుణ హత్య?
ఆధారాలు సేకరిస్తున్న క్లూస్‌ టీం సభ్యులు

రణస్థలం, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): లావేరు మండలం తాళ్లవలసలో అనుమానాస్పద స్థితిలో మృతదేహం కనిపించింది. నేలబావిలో తల, మొండెం వేర్వేరుగా ఉండడం కలకలం సృష్టించింది. లావేరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతుడిని అప్పాపురం గ్రామానికి చెందిన కె.అసిరినాయుడు (33)గా గుర్తించారు. ఈనెల 2న అసిరినాయుడు అదృశ్యమైనట్టు లావేరు పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఇంతలోనే తాళ్లవలస సమీపంలో వ్యవసాయ నేలబావిలో మృతదేహం బయటపడింది. దారుణంగా హత్య చేసి పడేసినట్టు అక్కడి ఆనవాళ్లను బట్టి తెలుస్తోంది. మృతదేహం పూర్తిగా కుళిపోవడంతో దుర్గంధం వెలువడుతోంది. కుటుంబ, వివాహేతర సంబంధాల నేపథ్యంలోనే హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి తల్లి చిట్టమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు లావేరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Nov 09 , 2026 | 11:51 PM