Share News

సెమెన్‌ బ్యాంక్‌కు బయో రక్ష..!

ABN , Publish Date - May 23 , 2026 | 05:19 AM

పశువుల్లో ప్రమాదకర బ్రూసెల్లోసిస్‌ బ్యాక్టీరియా వ్యాప్తి చెందకుండా నిరోధించేందుకు బనవాసి సెమెన్‌ బ్యాంక్‌ వైద్యాధికారు లు బయో సెక్యూరిటీ చర్య లు చేపట్టారు.

సెమెన్‌ బ్యాంక్‌కు బయో రక్ష..!

  • బ్యాక్టీరియా నిరోధానికి బయోసెక్యూరిటీ పద్ధతులు

  • బనవాసి పశుక్షేత్రంలో బ్రూసెల్లోసిస్‌ కలవరం

కర్నూలు/ఎమ్మిగనూరు రూరల్‌, మే 22 (ఆంధ్రజ్యోతి): పశువుల్లో ప్రమాదకర బ్రూసెల్లోసిస్‌ బ్యాక్టీరియా వ్యాప్తి చెందకుండా నిరోధించేందుకు బనవాసి సెమెన్‌ బ్యాంక్‌ వైద్యాధికారు లు బయో సెక్యూరిటీ చర్య లు చేపట్టారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండ లం బనవాసి జెర్సీ పశుక్షేత్రంలోని ఏపీ పశు గణాభివృద్ధి సంస్థకు చెందిన ఆబో తు వీర్య నిల్వ కేంద్రం (ఫ్రోజెన్‌ సెమెన్‌ బుల్‌ స్టేషన్‌)లో ఎనిమిది పశువులు, ఇద్దరు కూలీలకు బ్రూసెల్లోసిస్‌ వ్యాధి సోకిన విషయం తెలిసిందే. పశువుల నుంచి మనుషులకు వ్యాపించే ఈ వ్యాధి పట్ల ప్రజల్లో భయాందోళన నెలకొంది. దీనిపై ‘భయపెడుతున్న బ్రూసెల్లోసిస్‌’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’లో శుక్రవారం ఓ కథనం ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో అధికారులు శుక్రవారం బ్రూసెల్లోసిస్‌ బ్యాక్టిరీయా వ్యాప్తి నిరోధక చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే వ్యాధి సోకిన పశువులు, కూలీలను వేర్వేరుగా ప్రత్యేక క్వారంటైన్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ కేంద్రంలో బ్యాక్టిరీయా నివారణకు బ్యూటిరాల్డిహైడ్‌ అనే పురుగుమందును పిచికారీ చేస్తున్నామని ఆ కేంద్రం సహాయ సంచాలకుడు(ఏడీ) డాక్టర్‌ శ్రీనివాసరెడ్డి శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు. ఈ కేంద్రంలో జెర్సీ, ముర్రా సహా వివిధ జాతులకు చెందిన 88 రకాల ఎద్దులు, ఆబోతుల నుంచి సేకరించే వీర్యాన్ని మేలు జాతి దూడల ఉత్పత్తి కోసం వివిధ రాష్ట్రాలకు సరఫరా చేస్తారు. ప్రమాదకరమైన బ్రూసెల్లోసిస్‌ సోకడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో వ్యాధి సోకిన పశువుల నుంచి గతేడాది నవంబరు 1 నుంచి ఈ నెల 14వ తేదీ వరకు సేకరించిన రూ.10.75 లక్షల విలువైన 43 వేల వీర్యం డోసుల(సెమెన్‌ ట్రాలు)ను నిర్వీర్యం చేస్తామని అధికారులు తెలిపారు.

Updated Date - May 23 , 2026 | 05:20 AM