Share News

మంత్రి నారాయణతో బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ భేటీ

ABN , Publish Date - Jan 21 , 2026 | 03:45 AM

బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ గారెత్‌ విన్‌ ఓవెన్‌ మంగళవారం రాష్ట్ర మున్సిపల్‌, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణను మర్యాదపూర్వకంగా కలిశారు.

మంత్రి నారాయణతో బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ భేటీ

  • అమరావతి అభివృద్ధికి కలిసి పనిచేస్తామని వెల్లడి

అమరావతి, జనవరి 20(ఆంధ్రజ్యోతి): బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ గారెత్‌ విన్‌ ఓవెన్‌ మంగళవారం రాష్ట్ర మున్సిపల్‌, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అమరావతి నిర్మాణ పనుల పురోగతిని నారాయణ ఆయనకు వివరించారు. అమరావతి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని ఓవెన్‌ పేర్కొన్నారు. సమావేశంలో అమరావతి గ్రోత్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ ఎండీ శ్రీనివాస్‌ కూడా పాల్గొన్నారు.

Updated Date - Jan 21 , 2026 | 04:44 AM