Share News

ప్రజల వద్దకు పాలనే లక్ష్యం

ABN , Publish Date - Oct 02 , 2026 | 11:41 PM

ప్రజల వద్దకు పరిపాలన తీసుకెళ్లడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు.

 ప్రజల వద్దకు పాలనే లక్ష్యం
మాట్లాడుతున్న ఎమ్మెల్యే పార్థసారథి

- ఎమ్మెల్యే పార్థసారథి

ఆదోని రూరల్‌, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి) : ప్రజల వద్దకు పరిపాలన తీసుకెళ్లడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. శుక్రవారం ఎంపీపీ భవనలో ఎంపీడీవో నాగరాజు స్వామి అధ్యక్షతన పేదల సేవలో 2.0 కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే, ఆర్డీవో అరుణాదేవి, డీఎస్పీ వెంకటరమణ, కురువ కార్పొరేషన చైర్మన దేవేంద్రప్ప, ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాడు వైసీపీ ప్రభుత్వంలో రౌడీలు, గుండాలు రాజ్యమేలారని, అందుకే ప్రజలు జగన్మోహనరెడ్డి ప్రభుత్వాన్ని తిరస్కరించారన్నారు. కూటమి ప్రభుత్వం పారదర్శకంగా పని చేస్తోందని అధికారులు సహకరించాలని కోరారు. ముఖ్యంగా అధికారులు రాజ్యాంగానికి అనుగుణంగా, చట్టబద్ధంగా ఉంటూ, ప్రజల సమస్యలను ఎక్కడికక్కడే పరిష్కరిస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్నారు. పీ-4 కార్యక్రమంలో భాగంగా బంగారు కుటుంబాల అభివృద్ధి కోసం వ్యాపార వేత్తలు, ధనవంతులు ఉన్నత స్థాయిలో ఉన్న వారు ఎవరైనా సరే ముందుకు రావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

Updated Date - Oct 02 , 2026 | 11:41 PM