Share News

ప్రజల గడప వద్దకే పాలన

ABN , Publish Date - Jun 27 , 2026 | 11:53 PM

ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని వాటికి తక్షణ పరిష్కారం చూపడమే తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే డా.పి.వి.పార్థసారథి స్పష్టం చేశారు.

ప్రజల గడప వద్దకే పాలన
ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే పార్థసారథి

- ఎమ్మెల్యే పార్థసారథి

ఆదోని, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని వాటికి తక్షణ పరిష్కారం చూపడమే తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే డా.పి.వి.పార్థసారథి స్పష్టం చేశారు. ‘ప్రజల కోసం... మీ పార్థసారథి’ కార్యక్రమంలో భాగంగా శనివారం ఆయన ఆదోనిలోని అంబేడ్కర్‌ నగర్‌లో పర్యటించి, ఇంటింటికి వెళ్లి ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. అంబేడ్కర్‌ నగర్‌ వాసులు తమ కాలనీలో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా కమ్యూనిటీ మరుగుదొడ్ల కొరత, విద్యుత్‌ సరఫరాలో తక్కువ ఓల్టేజ్‌ సమస్యతో పడుతున్న ఇబ్బందులను ఆయనకు వివరించారు. అలాగే కొండపై నివాసముంటున్న కుటుంబాల కోసం మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ, రహదారి సౌకర్యాలు కల్పించాలని కోరారు. యుద్ధ ప్రాతిపదికన సమస్యలను అధికారులు పరిష్క రించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ నాయకులు లక్ష్మీనారాయణ, రమేష్‌, నా యకు లు బొబ్బిలి, వై.పి.వీరేష్‌, సన్నప్ప, వీరేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 27 , 2026 | 11:53 PM