Share News

బస్‌ షెల్టర్‌ను వినియోగంలోకి తీసుకురండి

ABN , Publish Date - Apr 25 , 2026 | 11:48 PM

మండల కేంద్రంలోని పాత బస్టాండ్‌లో నిరుపయోగంగా బస్‌ షెల్టర్‌ను మరమ్మతులు చేపట్టి విని యోగంలోకి తీసుకురావాలని జిల్లా పంచాయతీ అధికారి భాస్క ర్‌ ఆదేశించారు.

బస్‌ షెల్టర్‌ను వినియోగంలోకి తీసుకురండి
బస్‌ షెల్టర్‌ను పరిశీలిస్తున్న డీపీవో భాస్కర్‌

వెల్దుర్తి, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని పాత బస్టాండ్‌లో నిరుపయోగంగా బస్‌ షెల్టర్‌ను మరమ్మతులు చేపట్టి విని యోగంలోకి తీసుకురావాలని జిల్లా పంచాయతీ అధికారి భాస్క ర్‌ ఆదేశించారు. శనివారం వెల్దుర్తిలో డీపీవో పర్యటించారు. మేజర్‌ గ్రామపంచాయతీ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. రికార్డులను పరిశీ లించారు. ఎండలు అధికంగా ఉన్నందున పాతబస్టాండ్‌ పరిసర ప్రాం తాల్లో మరిన్ని చలువు పందిళ్లు ఏర్పాటు చేయాలన్నారు. చలివేంద్రాల ద్వారా ప్రజలకు మంచినీటిని అందించాలన్నారు. బస్టాండ్‌ పరిసర ప్రాంతాల్లో చెత్తాచెదారాలను ఎప్పటికప్పుడు తీసివేయాలన్నారు. గ్రా మాన్ని పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో చంద్రశేఖర్‌రెడ్డి, డిప్యూటీ ఎంపీడీవో రవికిశోర్‌, పంచాయతీ కార్యదర్శి లక్ష్మీనాథ్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2026 | 11:48 PM