రైతుల కోసమే వంతెన నిర్మాణం
ABN , Publish Date - Apr 23 , 2026 | 11:41 PM
పొలాలకు వెళ్లే రైతుల ఇబ్బందులు తీర్చేందుకే బుగ్గవంకపై వంతెననిర్మాణం చేపడుతున్నామని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు.
ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు
పత్తికొండ పట్టణంలో సీసీ రహదారులు ప్రారంభం
పత్తికొండ, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి): పొలాలకు వెళ్లే రైతుల ఇబ్బందులు తీర్చేందుకే బుగ్గవంకపై వంతెననిర్మాణం చేపడుతున్నామని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు. గురువారం పట్టణంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ముం దుగా రూ. 43లక్షలతో నిర్మించిన కటికెవీధి, స్టేట్‌బ్యాంక్ కాలనీ, రూ.70లక్షలతో రామదాసునగర్ నుంచి ప్రతిభాపాఠశాల వర కు నిర్మించిన సీసీ రహదారిను ఆయన ప్రారంభించారు. అనంతరం చక్రాళ్లరహదారిలో చెరువుకు నీరుచేరేందుకు అనుసంధానంగా ఉన్న బుగ్గవంకపై రూ. 45లక్షలతో నూతనంగా నిర్మించనున్న వంతెన నిర్మాణ పనులకు ఆయన భూ మిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణం లో అన్నిప్రాంతాలకు సీసీరోడ్లు, డ్రైనేజీ సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. వంతెన నిర్మా ణం పనులు త్వరగతిన చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ఈ సందర్భంగా కొండగేరి రైతులు ఎమ్మెల్యేను సత్కరించారు. కార్యక్రమాలలో టీడీపీ నాయకులు సాంబశివారెడ్డి, ప్రమోద్‌కుమార్‌రెడ్డి, వెంకటపతి, లోక్‌నాథ్, చల్లారవి, బీటీ గో విందు, సుధాకర్, బ్రహ్మయ్య, కాంట్రాక్టర్లు దశరథరామిరెడ్డి, మురళీ ఉన్నారు.