Share News

మా మాట ‘మావిగన్‌’

ABN , Publish Date - Apr 08 , 2026 | 04:57 AM

అమరావతికి ప్రత్యామ్నాయంగా జగన్‌ చేసిన ‘మావిగాన్‌’ ప్రతిపాదనను సమర్థిస్తున్నామని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. వైసీపీ నేతలు....

మా మాట ‘మావిగన్‌’

  • ‘ఆంధ్రజ్యోతి’ ఆఫీసుల ముందు నేడు ధర్నాలు: బొత్స

విశాఖపట్నం, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): అమరావతికి ప్రత్యామ్నాయంగా జగన్‌ చేసిన ‘మావిగాన్‌’ ప్రతిపాదనను సమర్థిస్తున్నామని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. వైసీపీ నేతలు, వారి కుటుంబాల్లోని మహిళలను ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణ దూషించారని.. ఆ వ్యాఖ్యలను తక్షణం ఉపసంహరించుకోవాలని అన్నారు. మంగళవారం విశాఖలో బొత్స మాట్లాడారు. రాధాకృష్ణ వ్యాఖ్యలను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి లోకేశ్‌ సమర్థించడాన్ని నిరసిస్తూ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోని ‘ఆంధ్రజ్యోతి’ కార్యాలయాల వద్ద శాంతియుత ధర్నాకు పిలుపిస్తున్నామని తెలిపారు.

Updated Date - Apr 08 , 2026 | 04:57 AM