గజదొంగను పట్టుకోవాలి
ABN , Publish Date - Feb 26 , 2026 | 03:52 AM
తిరుమల లడ్డూ విషయంలో గుమస్తాలను, చిన్న ఉద్యోగులను తప్పుబడుతన్నారని శాసనమండలిలో ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ అన్నారు.
తిరుమల లడ్డూ విషయంలో గుమస్తాలు,చిరుద్యోగులనే తప్పుబడుతున్నారు
చంద్రబాబు క్షమాపణలు చెప్పి ఉంటే ఈ అంశానికి ముగింపు వచ్చేది: బొత్స
అమరావతి, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): తిరుమల లడ్డూ విషయంలో గుమస్తాలను, చిన్న ఉద్యోగులను తప్పుబడుతన్నారని శాసనమండలిలో ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ అన్నారు. కిలో రూ.341 రూపాయల నెయ్యిని రూ.658కు అమ్ముతున్న గజదొంగను ఎందుకు పట్టుకోవడం లేదని ప్రశ్నించారు. తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని వ్యాఖ్యానించిన సీఎం చంద్రబాబు క్షమాపణలు చెప్పి ఉంటే, ఈ ఆంశానికి ముగింపు వచ్చేదన్నారు. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో తప్పు చేసినట్టుగా తేలినవారిని శిక్షిస్తే తమకు అభ్యంతరం లేదని అన్నారు. బుధవారం శాసనసభా ప్రాంగణంలోని తన చాంబర్‌లో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. వైష్ణవి డెయిరీ ప్రాంగణంలోనికి సంగం డెయిరీ వాహనాలెందుకు వెళుతున్నాయని ప్రశ్నించారు. అదేమీ పార్కింగ్ ప్రాంతం కాదని, వాహనాలు రిపేరు చేసే వర్క్‌షాపు కూడా కాదు కదా అని ప్రశ్నించారు. సంగం డెయిరీ లోగోలతో కూడిన ట్యాంకర్లు వైష్ణవి డెయిరీలోనికి వెళ్లడానికి కారణాలేమిటని అన్నారు.