Share News

లడ్డూపై ఆఖరి రోజు వరకు చర్చకు పట్టు: బొత్స

ABN , Publish Date - Feb 27 , 2026 | 04:08 AM

లడ్డూ కల్తీ నెయ్యి, ఇందాపూర్‌, హెరిటేజ్‌ సంబంధాలపై ఆఖరి రోజు వరకు చర్చకు పట్టుబడుతూనే ఉంటామని శాసనమండలిలో విపక్షనేత బొత్స సత్యనారాయణ చెప్పారు.

లడ్డూపై ఆఖరి రోజు వరకు చర్చకు పట్టు: బొత్స

అమరావతి, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): లడ్డూ కల్తీ నెయ్యి, ఇందాపూర్‌, హెరిటేజ్‌ సంబంధాలపై ఆఖరి రోజు వరకు చర్చకు పట్టుబడుతూనే ఉంటామని శాసనమండలిలో విపక్షనేత బొత్స సత్యనారాయణ చెప్పారు. లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంపై అసెంబ్లీలో చర్చించినప్పుడు మండలిలో ఎందుకు చర్చించడంలేదని ప్రశ్నించారు. గురువారం అసెంబ్లీ గేటు బయట ఆయన మీడియాతో మాట్లాడారు. ఇందాపూర్‌ ముసుగులో హెరిటేజ్‌ చేసిన అవినీతి గురించి చర్చజరగడం ఇష్టంలేకనే ప్రభుత్వం వాయిదా వేయించిందని ఆరోపించారు. సభా నియమాలను ఉల్లంఘించారన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్నీ తాను చెబితేనే చంద్రబాబు ఆపారని టీ-సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారని.. ఇది వాస్తవమా కాదా? అని అడిగితే సభలో సమాధానం చెప్పలేదన్నారు. సీమ ఎత్తిపోతల పనులన్నీ ఆపేయాలని 2020లో ఎన్‌జీటీ అభ్యంతరం చెప్పడంతోనే జగన్‌ ప్రభుత్వ హయాంలోనే పనులన్నీ ఆపేశారు కదా అని విలేకరులు ప్రశ్నించగా... బొత్స దాటవేశారు.

Updated Date - Feb 27 , 2026 | 04:10 AM