కోర్టులకు మళ్లీ బాంబు బెదిరింపులు
ABN , Publish Date - Feb 25 , 2026 | 05:12 AM
ఉమ్మడి అనంతపురం జిల్లాలో పలు కోర్టులకు మరోమారు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి.
అనంతపురం క్రైం/పుట్టపర్తి రూరల్, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి అనంతపురం జిల్లాలో పలు కోర్టులకు మరోమారు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. అనంతపురం జిల్లా కోర్టు, ఉరవకొండ కోర్టు.., శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం అదనపు జిల్లా కోర్టు, కదిరి, పుట్టపర్తి జూనియర్ సివిల్, ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులకు మంగళవారం ఉదయం రమీజా హుస్సేనీ పేరుతో హాట్ మెయిల్ నుంచి బెదిరింపు సందేశం పంపించారు. డాగ్‌స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్‌తో వెళ్లి పోలీసులు తనిఖీలు చేశారు. పేలుడు పదార్థాలు ఏవీ లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.