Share News

చిత్తూరు జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు

ABN , Publish Date - Mar 04 , 2026 | 04:08 AM

చిత్తూరు జిల్లా కోర్టును పేల్చేస్తామంటూ బాంబు బెదిరింపు వచ్చింది. మంగళవారం మధ్యాహ్నం 1.30 నుంచి 2 గంటల్లోపు...

చిత్తూరు జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు

చిత్తూరు లీగల్‌, మార్చి 3(ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా కోర్టును పేల్చేస్తామంటూ బాంబు బెదిరింపు వచ్చింది. మంగళవారం మధ్యాహ్నం 1.30 నుంచి 2 గంటల్లోపు బాంబులతో కోర్టును పేల్చేస్తామంటూ జిల్లా కోర్టు సముదాయంలోని ఈ-కోర్టుకు మెయిల్‌ వచ్చింది. దీంతో న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది, కక్షిదారులు బయటకు పరుగులు తీశారు. పోలీసు సిబ్బంది కోర్టు ఆవరణ, పరిసరాల్లో ముమ్మరంగా గాలించారు. చివరకు ఉత్తుత్తి బెదిరింపు అని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు.

Updated Date - Mar 04 , 2026 | 04:08 AM