బొల్లాకు షరతులతో బెయిల్
ABN , Publish Date - Jun 20 , 2026 | 05:43 AM
గండిపేట భూకబ్జా కేసులో అరెస్టయి చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు బెయిల్‌పై విడుదలయ్యారు.
సైదాబాద్, జూన్ 19(ఆంధ్రజ్యోతి): గండిపేట భూకబ్జా కేసులో అరెస్టయి చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు బెయిల్‌పై విడుదలయ్యారు. రంగారెడ్డి జిల్లా కోర్టు శుక్రవారం ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 6న నార్సింగి పోలీసులు బొల్లాను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే.