భోగాపురానికి వస్తున్నాం!
ABN , Publish Date - May 26 , 2026 | 05:46 AM
విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం, ఆపరేషన్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన తేదీ ప్రకటించకపోయినా..
మరిన్ని విమానయాన సంస్థల సోషల్ ప్రచారం
విశాఖపట్నం, మే 25(ఆంధ్రజ్యోతి): విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం, ఆపరేషన్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన తేదీ ప్రకటించకపోయినా... విమాన సంస్థలు మాత్రం ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. సింగపూర్‌కు చెందిన స్కూట్ ఎయిర్‌లైన్స్ తమ విమానాన్ని జూలై 8 నుంచి భోగాపురం నుంచి నడుపుతామని ప్రకటించింది. జూలై 9 నుంచి భువనేశ్వర్, రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్, అహ్మదాబాద్ తదితర నగరాల నుంచి వచ్చే విమానాలు భోగాపురం విమానాశ్రయం నుంచి నడుస్తాయని పేర్కొన్నాయి.