Share News

బొబ్బిలి రూరల్‌ సీఐ శ్రీనివాస్‌ బదిలీ

ABN , Publish Date - Jul 05 , 2026 | 05:36 AM

విజయనగరం జిల్లా బొబ్బిలి రూరల్‌ సీఐ ఎస్‌. శ్రీనివాస్‌ విశాఖపట్నం సిటీకి బదిలీ అయ్యారు. ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఇటీవల హైదరాబాద్‌కు..

బొబ్బిలి రూరల్‌ సీఐ శ్రీనివాస్‌ బదిలీ

  • యూట్యూబర్‌ కేవీ రెడ్డి అరెస్టులో కీలక పాత్ర

  • కేవీ రెడ్డి భార్య తదితరులపై కేసు నమోదు

బొబ్బిలి జూలై 4(ఆంధ్రజ్యోతి): విజయనగరం జిల్లా బొబ్బిలి రూరల్‌ సీఐ ఎస్‌. శ్రీనివాస్‌ విశాఖపట్నం సిటీకి బదిలీ అయ్యారు. ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఇటీవల హైదరాబాద్‌కు చెందిన యూట్యూబర్‌ కేవీ రెడ్డి అరెస్టులో ఆయన కీలకంగా వ్యవహరించారు. ఇది జరిగిన రెండు రోజులకే ఆయన్ను బదిలీ చేశారు. కాగా, సీఐ శ్రీనివాస్‌ తమపై అనుచితంగా ప్రవర్తించారని కేవీ రెడ్డి భార్య విజయలక్ష్మి ఫిర్యాదు చేయడంతో హైదరాబాద్‌ సరూర్‌నగర్‌ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ కేవీ రెడ్డి భార్య విజయలక్ష్మితోపాటు మరికొందరిపైనా కేసు నమోదు చేశారు.

Updated Date - Jul 05 , 2026 | 05:49 AM