విశాఖ జూలో నల్ల చిరుత
ABN , Publish Date - Apr 22 , 2026 | 04:54 AM
విశాఖ జంతు ప్రదర్శనశాలలో సందర్శకుల వీక్షణకు వీలుగా నల్ల చిరుతను మంగళవారం ఎన్‌క్లోజర్‌లోకి విడిచిపెట్టారు. అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ చలపతిరావు చిరుతను కొత్తగా...
సుమారు 40 ఏళ్ల తరువాత..
ఆరిలోవ (విశాఖపట్నం), ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): విశాఖ జంతు ప్రదర్శనశాలలో సందర్శకుల వీక్షణకు వీలుగా నల్ల చిరుతను మంగళవారం ఎన్‌క్లోజర్‌లోకి విడిచిపెట్టారు. అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ చలపతిరావు చిరుతను కొత్తగా నిర్మించిన ఎన్‌క్లోజర్‌లోకి పంపించారు. ఆయన మాట్లాడుతూ గత నెల ఐదో తేదీన అసోం జూ కమ్ బొటానికల్ గార్డెన్ నుంచి ఈ నల్ల చిరుతను తీసుకొచ్చామని.. దీనిని ఘోస్ట్ ఆఫ్ జంగిల్‌గా పిలుస్తారన్నారు. వెటర్నరీ వైద్యుల పర్యవేక్షణలో 45 రోజులు క్వారంటైన్‌లో ఉంచామని, చిరుత ఆరోగ్యంగా ఉందని నిర్ధారించాక ఎన్‌క్లోజర్‌లోకి విడిచిపెట్టామన్నారు. సుమారు 40 ఏళ్ల అనంతరం ఆడ బ్లాక్ పాంథర్‌ను అధికారికంగా ఎన్‌క్లోజర్‌లోకి విడిచిపెట్టడం ఆనందంగా ఉందన్నారు.