Share News

నల్ల కన్ను మృతి బాధాకరం

ABN , Publish Date - Feb 27 , 2026 | 12:13 AM

స్వాతంత్య్ర సమరయోధులు, సీపీఐ అగ్రనేత నల్లకన్ను మృతి బాధాకరమని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామచంద్రయ్య అన్నారు.

నల్ల కన్ను మృతి బాధాకరం
నల్లకన్ను చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న సీపీఐ నాయకులు

సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు

రామచంద్రయ్య

చిత్రపటానికి నివాళి

పత్తికొండ టౌన్‌, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర సమరయోధులు, సీపీఐ అగ్రనేత నల్లకన్ను మృతి బాధాకరమని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామచంద్రయ్య అన్నారు. గురువారం స్థానిక సీఆర్‌ భవన్‌లో నల్లకన్ను చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా రామచంద్రయ్య మాట్లాడుతూ స్వాతంత్ర్యానికి ముందే ఈ దేశంలో సీపీఐ ఆవిర్భవించిన 1925లో తమిళనాడులో నల్లకన్ను జన్మించాడన్నారు. భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటీష్‌ సైన్యానికి ముచ్చెమటలు పట్టించారన్నారు. అనంతరం మార్క్‌, లెనిన్‌ స్ఫూర్తితో కమ్యూనిస్టు పార్టీలో చేరి కుల వివక్షతకు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటాలు చేశాడన్నారు. తమిళనాడులో గాంధీగా పేరుగాంచిన నల్లకన్ను ఇక లేరని వార్త జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. కార్యక్రమంలో సీపీఐ పట్టణ కార్యదర్శి రామాంజనేయులు, జిల్లా కార్యవర్గ సభ్యులు నభిరసూల్‌, రాజాసాహెబ్‌, మద్దిలేటిశెట్టి, నాయకులు కృష్ణయ్య, వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పార్టీకి తీరని లోటు

దేవనకొండ: సీపీఐ నేత నల్లకన్ను మృతి పార్టీకి తీరని లోటని సీపీఐ మండల కార్యదర్శి నర్సారావు అన్నారు. గురువారం స్థానిక సీపీఐ కార్యాలయంలో నల్లకన్ను చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. పేదల హక్కుల కోసం పోరాటాలు చేసిన ప్రజా ఉద్యమ నాయకుడుని కోల్పోవడం పార్టీకి తీరని లోటన్నారు. సీపీఐ మండల నాయకులు కండప్ప, శుకర్‌, భాస్కర్‌, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 27 , 2026 | 12:14 AM